ఈఈఎస్​ఎల్ బల్బులతో 30 శాతం కరెంటు ఆదా

ఈఈఎస్​ఎల్ బల్బులతో 30 శాతం కరెంటు ఆదా

న్యూఢిల్లీ :  ప్రభుత్వ యాజమాన్యంలోని ఎనర్జీ సేవింగ్​ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఈఈఎస్​ఎల్​ మంగళవారం ఆరువాట్ల ఎల్​ఈడీ బల్బ్‌‌ను పరిచయం చేసింది. దీంతో 30 శాతం వరకు కరెంటు ఆదా అవుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకం ఉజాలా  ద్వారా ఇది అమ్మకానికి అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్‌‌ఈడీ బల్బులు, ఎల్‌‌ఈడీ ట్యూబ్ లైట్లు,  బీఎల్‌‌డీసీ ఫ్యాన్‌‌ల కోసం టెండర్ ప్రక్రియ పూర్తయిందని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్  తెలిపింది.

 తమ ఆన్‌‌లైన్ ప్లాట్‌‌ఫారమ్ అయిన ఈఈఎస్​ఎల్​ మార్ట్ ద్వారా ఈ ఉత్పత్తులను ఆర్డర్ ​చేయవచ్చు.   కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌‌కే సింగ్ ఇటీవల నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్,  ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్ ప్రోగ్రామ్స్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఈఈఎస్​ఎల్​ బీఎల్​డీసీ ఫ్యాన్ ఇండక్షన్ కుక్‌‌స్టవ్‌‌లను ఆవిష్కరించారు. వీటితో కరెంటు ఎంతో ఆదా అవుతుందని తెలిపారు.