ముంబైలోని మురికవాడ ధారావిలో మళ్లీ కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 30 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఇరుకు ప్రదేశాలు, కనీస సౌకర్యాలు కూడా సరిగా ధారావిలో కరోనా వ్యాప్తించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
ధారావిలో ఇప్పటివరకు 4,328 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం అక్కడ 140 ఆక్టివ్ కేసులున్నాయి. ఫిబ్రవరి 26న ఆ కేసులు సంఖ్య 51గా ఉంది. దాదర్, ధారావి, మహిమ్.. గ్రేటర్ ముంబైలోని నార్త్ వార్డ్ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ నిన్న 102 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం ఆక్టివ్ కేసులు 673కి చేరాయి. ఈ వార్డులో వైరస్ ఉద్ధృతి కనిపిస్తుండటంతో.. బీఎంసీ అక్కడి ప్రజలందరికీ స్క్రీనింగ్ చేయడం మొదలు పెట్టింది. ఫిబ్రవరి నుంచి ధారావిలో కేసుల పెరుగుదల కనిపిస్తోంది.
