తమిళనాడు టెక్నాలజీపై సిరిసిల్ల నేతన్నల స్టడీ

  • ఇటీవల ఆ రాష్ట్రానికి వెళ్లిన 30 మంది వస్త్ర వ్యాపారులు 
  • మోడ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనితీరుపై పరిశీలన 
  • మోడ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మగ్గాలతో తమిళనాడులో పెరిగిన బట్ట క్వాలిటీ, ఉత్పత్తి 
  • ఇక్కడా ఆ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు వస్త్రవ్యాపారుల ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాజన్నసిరిసిల్ల, వెలుగు: బట్టల తయారీలో టెక్నాలజీపై స్టడీ చేసేందుకు ఇటీవల సిరిసిల్లకు చెందిన యువ వస్త్ర వ్యాపారులు తమిళనాడు రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ మోడ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగం పెరగడంతో బట్ట క్వాలిటీతోపాటు ఉత్పత్తి కూడా పెరిగింది. ఆ రాష్ట్రానికి చెందిన కోయంబత్తూర్, తిరుపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న బట్టలకు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగింది. దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు విదేశాలకు కూడా ఇక్కడి వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. దీంతో మోడ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మగ్గాల పనితీరును తెలుసుకునేందుకు 30 మంది వస్త్రవ్యాపారులు ఆ రాష్ట్రానికి వెళ్లి సౌతిండియా టెక్స్ టైల్ రీసెర్చ్ ఏజెన్సీ(ఎస్ఐటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) లో పూర్తి వివరాలు తెలుసుకున్నారు. 

వస్త్ర ఉత్పత్తిపై అధ్యయనం 

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై సుమారు 50 వేల మంది పద్మశాలీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. కాగా వీరిలో దాదాపు 5వేల మంది పాత సంచాలపై బట్టను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఉత్పత్తిలో సిరిసిల్ల నేతన్నలు ప్రస్తుత పోటీని తట్టుకోలేకపోతున్నారు. ఈక్రమంలో సిరిసిల్లకు చెందిన సుమారు 30 మంది వస్త్ర వ్యాపారులు తమిళనాడులో వస్త్ర ఉత్పత్తిపై అధ్యయనానికి వెళ్లారు. 

సొంత ఖర్చులతో ఎస్ఐటీఆర్​ఏలో  శిక్షణ తీసుకున్నారు.  మార్కెటింగ్, ఉత్పత్తి, ప్రభుత్వ ప్రోత్సాహం, రాయితీ తదితర వివరాలను స్టడీ చేశారు. తిరుపూర్ లోని టెక్స్ టైల్స్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ ఆధ్వర్యంలోని  అపెరల్ మిల్లులో క్లాత్ ఉత్పత్తి గురించి తెలుసుకున్నారు. దేశంలో ఉత్పత్తయ్యే గార్మెంట్స్​లో 50శాతం తిరుపూర్​, కోయంబత్తూర్​, ఈరోడ్​ లోనే ఉత్పత్తవుతోంది. తమిళనాడులో అమలవుతున్న మోడ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీని సిరిసిల్లలోనూ వినియోగించేందుకు ఇక్కడి వస్త్రవ్యాపారులు రెడీ అవుతున్నారు. 

ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు

తమిళనాడు వస్త్ర పరిశ్రమలో  టీ షర్ట్​, నైట్ పాయింట్స్, అండర్ వేర్, బనియన్స్  ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుండడంతో వస్త్రపరిశ్రమ అభివృద్ధి చెందింది. తమిళనాడు తరహాలో సిరిసిల్లలోనూ మోడ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మగ్గాలతో ఉత్పత్తి చేస్తే సిరిసిల్లలో నేతన్నలకు ఉపాధి దొరుకుతుంది. 

రిక్కమల్లే వేణుగోపాల్, వస్త్ర వ్యాపారి,సిరిసిల్ల

చాలా  విషయాలు తెలుకున్నాం 

తమిళనాడు టూర్ లో చాలా విషయాలు తెలుసుకున్నాం. 10 రోజులపాటు సొంత ఖర్చులతో తిరుపూర్, కోయంబత్తూర్ వెళ్లాం. వస్త్రోత్పత్తిలో  వారు సాధించిన ప్రగతి అద్భుతం. తమిళనాడుతో పోల్చితే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ చాలా వెనుకబడి ఉంది. సిరిసిల్ల లూమ్స్ మార్చాలి. కొత్త ర్యాపియర్ మగ్గాల ద్వారా బట్ట ఉత్పత్తి చేయాలి.

గడ్డం ప్రభాకర్,  వస్త్ర వ్యాపారి, సిరిసిల్ల.