సినీ నిర్మాతకి 3 ఏళ్ళు జైలు శిక్ష... తెలుగు హీరోయిన్ హ్యాపీ..

సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతన్న అకృత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే ఇటీవలే బాలీవడ్ హీరోయిన్ పై కత్తితో దాడి చేసిన కేసులో ప్రముఖ సినీ నిర్మాత యోగేష్ సింగ్ కి కోర్టు జైలు శిక్ష విధించింది. 

పూర్తీ వివరాల్లోకి తెలుగులో ప్రముఖ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడరా సామీ చిత్రంలో నటించి టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది ముంబై బ్యూటీ మాల్వి మల్హోత్రా. అయితే మాల్వి మల్హోత్రా ఓ సినిమా విషయమై బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత యోగేష్ సింగ్ ని కలిసింది.

అతి తక్కువ సమయంలోనే వీరిద్దరో ప్రేమలో పడ్డారు. దీంతో పెళ్లి కూడా చేసుకొవాలని అనుకున్నారు. కానీ అనుకోని విధంగా మనస్పర్థలు, విభేదాలు రావడంతో విడిపోయారు. కానీ యోగేష్ సింగ్ మాత్రం తనని పెళ్లి చేసుకోవాలని పలుమార్లు గొడవ చేసేవాడు. ఈ క్రమంలో ఓసారి ఏకంగా మాల్వి మల్హోత్రా పై కత్తితో దాడి చేశాడు. 

ALSO READ | మంత్రి కొండా సురేఖపై కోర్టులో నాగార్జున ఏం చెప్పారంటే..

దీంతో నటి మాల్వి మల్హోత్రా యోగేష్ సింగ్ పై పోలీసులకి ఫిర్యాదు చేసింది.  దాదాపుగా 3 ఏళ్ళ పాటూ  ఈ విషయంపై విచారణ జరిపి ఇటీవలే తీర్పు ఇచ్చింది. ఇందులోభాగంగా యోగేష్ సింగ్ కి 3 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. దీంతో ఈవిషయం తెలుసుకున్న మాల్వి మల్హోత్రా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 

ఈ క్రమంలో "మాతాజీ, ఈ నవరాత్రుల సమయంలో  నాకు న్యాయం చేసినందుకు మరియు నా సహనానికి ప్రతిఫలం ఇచ్చినందుకు ధన్యవాదాలు" అని పేర్కొంది. అంతేగాకుండా దాదాపుగా 4 ఏళ్ళ పాటూ చేసిన పోరాటంలో నాకు న్యాయం దక్కింది. ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉందని తెలిపింది.