బారాముల్లా జిల్లా సోపోర్ లో అర్థరాత్రి నుంచి ఎన్ కౌంటర్ మొదలైంది. సోపోర్ లోని ఓ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో... జమ్మూకశ్మీర్ పోలీసులు, CRPF, ఆర్మీ జాయింట్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. టెర్రరిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టాయి బలగాలు. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా... ఆపరేషన్ కూడా ముగిసిందని జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. స్పాట్ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
