లోయలో పడ్డ బస్సు..ముగ్గురు మృతి

 ఉత్తరఖండ్ లోని భీమ్ తల్ లో ఘోర ప్రమాదం జరిగింది . బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. అల్మోరా నుంచి హల్ద్వానీకి  27 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు నైనిటాల్‌లోని భీమ్‌తాల్ ప్రాంతంలో 1500 అడుగుల లోతైన లోయలో పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘనటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

 మరో వైపు  బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్  స్పందించారు.  ప్రమాద   ఘటన  వార్త చాలా బాధాకరమన్నారు.. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

#WATCH | Uttarakhand | A team of SDRF team is carrying out a rescue operation at the Bhimtal bus accident site along with local police and the Fire Department pic.twitter.com/cqvFvFjzNy

— ANI (@ANI) December 25, 2024