తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం రావులపాలెం మండలం గోపాలపురం వద్ద హైవేపై లారీ, టూవీలర్ వెహికిల్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కడపలోని మైదకూరు నుంచి కాకినాడ వెళ్తున్న లారీ గోపాలపురం వద్దకు రాగానే టూవీలర్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా గోపాలపురానికి చెందిన వారిగా గుర్తించారు.
యూకే-ఇండియా విమానాలపై నిషేదం ఎత్తివేత
