ఏపీలోని చిత్తూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల మండలంలోని నేండ్రగుంట వద్ద కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని చిత్తూరులోని రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఓ చిన్నారి ఉన్నారు. తిరుమల దర్శనం తర్వాత బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
మార్చి తొలి వారంలో నాగార్జున సాగర్ బై పోల్!
