ముంబై గొవాండి ఏరియాలో ఘోరం జరిగింది. భారీ వర్షాల కారణంగా గొవాండి ఏరియాలోని శివాజీ నగర్ లో మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప రాజవాడి హాస్పిటల్, లోక్ మాన్య తిలక్ మెమొరియల్ హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
