లాక్ డౌన్ వేళ మద్యం దుకాణాలన్ని మూతపడ్డాయి. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని షాపు తాళాలు పగలగొట్టి మద్యం సీసాలు దొంగిలించారు కొందరు దుండగలు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల గ్రామం శివారులో ఈ సంఘటన జరిగింది. మద్యం షాపు తాళాలు పగలగొట్టి 285 మద్యం సీసాలు దొంగిలించారు. వీటి విలువ రూ.2,11,000 ఉంటుందని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ మేనేజర్ పాండురంగారావు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ సంఘటనా స్థలంలో నైట్ గార్డ్ నిర్లక్ష్యం వల్ల ఈ చోరీ జరిగిందని అన్నారు. ఈ దొంగతనానికి పాల్పడిన వారు ఇంటి దొంగలా? లేక బయట దొంగల పనా? అని పోలీసు విచారణలో తేలుతుందని తెలిపారు. ఘటనా స్థలానికి భీమడోలు ఎక్సైజ్, ద్వారకా తిరుమల పోలీసులు చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
