నేషనల్ ఫెన్సింగ్‌ పోటీలకు 24 మంది ఎంపిక

హైదరాబాద్‌, వెలుగు: నేషనల్ ఫెన్సింగ్ పోటీల కోసం నిర్వహించిన  సెలెక్షన్‌ ట్రయల్స్‌లో  24 మంది ప్లేయర్లు ఎంపికయ్యారు. మాదాపూర్‌లోని డెక్కన్‌ ఫెన్సింగ్‌ క్లబ్‌లో  ఆదివారం జరిగిన  స్టేట్ క్యాడెట్‌ అండర్‌-17 సెలెక్షన్‌ ట్రయల్స్‌ కు మొత్తం 49 మంది ఫెన్సర్లు హాజరయ్యారు. 

ట్రయల్స్ లో సత్తా చూపి 24 మంది స్టేట్ టీమ్స్‌కు సెలెక్ట్ అయ్యారని తెలంగాణ ఫెన్సింగ్‌ సంఘం సెలెక్షన్‌ కమిటీ సభ్యుడు ఎల్‌.సందీప్‌ కుమార్‌ జాదవ్‌ తెలిపారు. అంతకుముందు ఈ ట్రయల్స్‌ ప్రారంభోత్సవానికి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు హాజరయ్యారు. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలు అభివృద్ధి చెందితేనే ఇండియా స్పోర్టింగ్‌ నేషన్‌గా మారుతుందని అన్నారు.