మెదక్ జిల్లా మనోహరాబాద్మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన 24 గంటల పీహెచ్సీలో డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. ఉదయం10 గంటల తర్వాత వచ్చి ఇష్టమొచ్చిన సమయానికి వెళ్లిపోతున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ వికాస్ ది రెడ్డిపల్లి పోస్టింగ్ కాగా మనోహరాబాద్ పీహెచ్సీకి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
అలాగే పీహెచ్సీ లో స్టాఫ్ నర్స్ ఒక్కరే ఉండడంతో రాత్రిపూట ఏఎన్ఎంలు నైట్ డ్యూటీ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్టాఫ్ నర్సులు, సిబ్బందిని కేటాయించి డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.
మనోహరాబాద్, వెలుగు