తిరుపతిలో కనిపించని 236 పాజిటీవ్ పేషేంట్లు

తిరుపతిలో కనిపించని 236 పాజిటీవ్ పేషేంట్లు

హాస్పిటల్లో చేరరు.. ఫోన్లు  స్విచ్ ఆఫ్…

సరైన అడ్రస్ లు  తెలియక తలలు పట్టుకుంటున్న వైనం

ఏం చేయాలో తెలియక పోలీసులకు పిర్యాదు చేసిన అధికారులు…

తిరుపతి కరోనా పాజిటివ్ కేసుల్లో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. కరోనా స్వాబ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినా బాధితులు ఆసుపత్రుల్లో చేరడం లేదు. స్వాబ్ టెస్ట్ కోసం శాంపిల్ తీసుకునే సమయంలో కొంతమంది రాంగ్ ఫోన్ నంబర్, తప్పుడు అడ్రస్‌ని ఇస్తున్నారు. టెస్ట్‌ల్లో పాజిటివ్ వచ్చిందని మెసేజ్ రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా రాంగ్ నంబర్ అని వస్తోంది,  ఇక చిరునామాకు వెళ్తే అది వారి అడ్రస్ కాదని తెలుస్తోంది. ఇలా గత పదిరోజుల్లో సుమారు 236 మంది కరోనా పాజిటివ్ బాధితుల ఆచూకీ తెలియలేదు.  దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.