ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,237 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,42,967కి చేరింది. ఇందులో 21,403 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,14,773 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 6791 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 86.63 లక్షల కరోనా టెస్ట్‌లు చేశారు. కృష్ణా 3, చిత్తూరు, విశాఖ జిల్లాల్లో కరోనాతో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
ఇక జిల్లాల వారీగా.. అనంతపురం 109, చిత్తూరు 329, తూర్పుగోదావరి 188, గుంటూరు 364, కడప 84, కృష్ణా 277, కర్నూలు 24, నెల్లూరు 88, ప్రకాశం 83, శ్రీకాకుళం 117, విశాఖపట్నం 108, విజయనగరం 87, పశ్చిమ గోదావరి 379 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
