ఐటీ జాబ్ చేస్తున్న 21 ఏళ్ల అమ్మాయిని చంపేసిన కారు.. హైదరాబాద్ రాయదుర్గంలో విషాదం

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. అతివేగంతో వెళుతున్న స్కోడా కారు అదుపు తప్పి ముందున్న బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న శ్రీవాణి (21) స్పాట్లోనే చనిపోయింది. ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. బైక్ నడుపుతున్న వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

శ్రీవాణి కామారెడ్డి వాసిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియాకి తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రాయదుర్గం పరిధిలో ఇలాంటి ప్రమాద ఘటనలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ALSO READ : హైదరాబాద్ బేగంబజార్లో ఘోరం.. భార్య గొంతు కోసి.. కొడుకు గొంతు నులిమి..

2024 ఆగస్ట్ లో కూడా ఈ తరహా ఘటనే జరిగింది. రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంది హిల్స్ నుండి వేగంగా వచ్చి మార్కం చెరువు వద్ద ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి ను వేగంగా డీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న యువకుడు స్పాట్ లో మృతి చెందాడు. ప్రమాద ధాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని చెప్పారు. ICFAI యూనివర్సిటీలో BBA చదువుతున్న విద్యార్థి చరణ్(19)గా గుర్తించారు. BNR హిల్స్ నుండి స్విఫ్ట్ డిజైర్ కారులో మెహిదీపట్నంలోని ఇంటికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.