Success: రక్షణరంగ సంస్కరణల ఏడాదిగా 2025

భారత సైన్యాన్ని అత్యాధునిక సాంకేతిక పోరాట శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 2025లో రక్షణ రంగంలో కీలక సంస్కరణలు తీసుకువచ్చేందుకు 2025ను రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  త్రివిధ దళాల మధ్య సయోధ్య పెంచేందుకు మరిన్ని సమీకృత థియేటర్​ కమాండ్ల ఏర్పాటు దిశగా రక్షణశాఖ సంస్కరణలు చేపట్టనున్నది.

 భవిష్యత్తులో జరిగే ఆపరేషన్ల అవసరాలకు తగినట్లు దళాల మధ్య సమన్వయం, సహకారం పెంపొందించడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకురానున్నది. యుద్ధ అవసరాలకు తగినట్లు వెంటనే ఆయుధాలను సమకూర్చుకోవడం, అభివృద్ధి చేయడానికి వీలుగా కీలకమైన పలు ఆయుధ కొనుగోళ్ల ప్రక్రియను సరళీకరించనున్నది. 

ALSO READ | Success: కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్.. గాంధీ సత్యాగ్రహం

2025లో సైబర్​ సెక్యూరిటీ, అంతరిక్షం, కృత్రిమ మేధ, మెషిన్​ లెర్నింగ్, హైపర్​ సోనిక్​ రోబోటిక్స్​ రంగాలపై దృష్టి సారించనున్నది. 21వ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్ల సన్నద్ధతకు ఈ సంస్కరణలు దోహదపడుతాయి.