AI.. కృత్రిమ మేధ ఏడాదిగా 2025

అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) 2025ను కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది. ఇంజినీరింగ్, మేనేజ్​మెంట్, పాలిటెక్నిక్​ తదితర కోర్సుల్లో కృత్రిమ మేధను మిళితం చేయడం, విద్యార్థులను ఆ రంగంలో నిపుణులుగా మార్చాలని నిర్ణయించింది. అందుకు ప్రాథమికంగా పలు చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ నెలాఖరులోపు కృత్రిమ మేధ అమలు ప్రణాళికను సమర్పించాలని దేశవ్యాప్తంగా తన పరిధిలోని  14 వేల విద్యాసంస్థల ప్రిన్సిపల్స్​కు, డైరెక్టర్లకు ఏఐసీటీఈ లేఖ రాసింది. కృత్రిమ మేధలో ఉత్తమ పనితీరు కనబరిచే కళాశాలలను పురస్కారాలు ప్రకటిస్తుంది. అందరికీ ఏఐ పేరిట విద్యాసంస్థల ప్రాంగణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు పలు రకాల కార్యక్రమాలను ఏఐసీటీఈ సూచించింది. అవి..

అవగాహన వారోత్సవాలు: వర్క్​షాప్​లు, నిపుణుల ప్రసంగాలు, హ్యాకథాన్ల నిర్వహణ. 
స్టూడెంట్​ చాప్టర్స్​ ఏర్పాటు: విద్యార్థులు ఒకరికి ఒకరు కలిసి నేర్చుకోవడం, ఏఐలో ఆవిష్కరలు చేయడం.
ల్యాబ్​లు: కళాశాలల్లో ఏఐ ల్యాబ్​లు నెలకొల్పడం.
కెరీర్​ మార్గం: విద్యార్థులకు ఏఐ రంగంలో అవకాశాలతోపాటు తదితర వాటిపై కెరీర్​ కౌన్సిలింగ్​ నిర్వహించడం.
అధ్యాపకులకు శిక్షణ: అన్ని బ్రాంచీల్లో కృత్రిమ మేధ పాఠ్యాంశాలను చేరుస్తారు. ప్రాథమిక అంశాలతోపాటు అడ్వాన్స్​డ్​ ఏఐ పాఠ్యాంశాలను చేర్చి సిలబస్​ను ఉన్నతీకరించాలని ఏఐసీటీఈ నిర్ణయించింది.