123 ఏళ్ల చరిత్రలో 2024లోనే ఇండియాలో తీవ్రమైన ఎండలు: ఐఎండీ వెల్లడి

1901 నుండి ఇండియాలో 2024లోనే అధికంగా ఎండలు చవిచూసిందని వెల్లడించింది ఐఎండీ. 123 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా గత ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది ఐఎండీ. 2016 లో నమోదైన ఉష్ణోగ్రతలను బ్రేక్ చేస్తూ 2024లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బుధవారం ( జనవరి 1, 2025 ) రిలీజ్ చేసిన రిపోర్ట్ లో వెల్లడించింది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా భూ ఉపరితల ఉష్ణోగ్రత సగటు 0.65 మేర పెరిగినట్లు తెలిపింది వాతావరణ శాఖ.

ప్రపంచవ్యాప్తంగా కూడా గత ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా నమోదయ్యిందని తెలిపింది వాతావరణ శాఖ. వాతావరణంలో వస్తున్న మార్పులే ఉష్ణోగ్రత పెరగటానికి కారణమని పేర్కొంది ఐఎండీ. ఈ కారణంగానే  ఎన్నడూ లేని విధంగా 2024లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.

ఇదిలా ఉండగా..  2025 దేశంలోని చాలా ప్రాంతాలలో పగలు, రాత్రి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చలి అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. వాయువ్య భారత ప్రాంతాలైన రాజస్థాన్ , గుజరాత్, ఉత్తర మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో పగటిపూట సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యి చలి తీవ్రత పెరుగుతుందని తెలిపింది వాతావరణ శాఖ.