2024 నోబెల్ గ్రహితలు వీరే.. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్

ఇటీవల కాలంలో 2024 నోబెల్ గ్రహితల పేర్లు ప్రకటించారు. వారి గురించి పోటీ పరీక్షల్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అభ్యర్థులు పూర్తిగా నోబెల్ పురస్కారాలపై అవగహాన పెంచుకోవాలి. కరెంట్ ఈవెంట్స్ కు లింక్ చేస్తూ నోబెల్ గ్రహీతల వివరాలు, వారి రంగాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. 2024లో నోబెల్ బహుమతులకు ఎంతమంది ఎంపికయ్యారనేది ఇప్పుడు చూద్దాం..

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ నోబెల్. స్వీడన్ దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త, వ్యాపారవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ అవార్డ్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న ప్రధానం చేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ --బోఫోర్స్ ఆయుధాలు తయారు చేసిన సంస్థకు చెందిన వ్యాపారవేత్త. ఆయన --డైనమైట్ అనే విస్ఫోటనాన్ని కనుగొన్నాడు. 1901 నుంచి నోబెల్ బహుమతులు ఐదు రంగాల్లో ఇస్తున్నారు. నోబెల్ శాంతి పురస్కారం మాత్రం --నార్వే రాజధాని ఓస్లోలో ప్రధానం చేస్తారు. మిగతా రంగాల్లో వారికి స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో అందజేస్తారు. 

ALSO READ | బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 ఉద్యోగాలు.. పరీక్ష లేదు, మెరిట్ ఆధారంగాఎంపిక

969 నుంచి అర్థశాస్త్రంలో కూడా ఇవ్వడం ప్రారంభించారు. 2024 సంవత్సరానికి12 మంది నోబెల్ పురస్కారాలకు ఎంపికైయ్యారు. అందులో ఓ సంస్థ, ఒక మహిళ ఉన్నారు. నోబెల్ పురస్కారంతో పాటుగా ప్రైజ్ మనీగా 11 మిలియన్ల స్వీడిష్ క్రోన్ (10 లక్షల అమెరికన్ డాలర్లు) ఇండియాలో వాటి విలువ 8.8 కోట్లు ఇస్తారు. ఒక రంగంలో లేదా ఒక అవార్డ్ ముగ్గురికి కూడా ఇవ్వొచ్చు. నోబెల్ పురస్కారము అందుకున్న గ్రహీతను  LAUREATE అని పిలుస్తారు.

2024 నోబెల్ అవార్డ్ గ్రహితలు వీరే.. 

విక్టర్ అంబ్రోస్, గ్యారీ రవ్ కున్(అమెరికా) వైద్య రంగంలో మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణకు గాను, క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలను అందించినందుకు ఇచ్చారు.

-జాన్  జె.హోప్ ఫీల్డ్, జెప్రీ ఈ హింటన్ (కెనడా) భౌతిక శాస్త్రంలో కృత్రిమ మేధ (AI) ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్ వర్క్ లో మిషన్ లెర్నింగ్ (ML) ఆవిష్కరణలకు గాను విశేష కృషి చేసినందుకు ప్రధానం చేశారు.(జెఫ్రీ ఈ హింటన్ ని గార్డ్ ఫాథర్ ఆఫ్  ఆర్టిఫిషియల్ ఇంటలిజెట్స్ అని అంటారు)

డేవిడ్ బేకర్, డేమిస్ హసాబిస్, జాన్ .ఎం.జంపర్() రసాయన శాస్త్రంలో  కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్, ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్ లకు ఇచ్చారు.

హాన్ కాంగ్( దక్షిణ కొరియా) సాహిత్యములో ది వెజిటేరియన్, ది వైట్ బుక్, హ్యూమన్ యాక్ట్స్ మరియు గ్రీక్ లెసన్స్ రచనలకు ఎంపికైంది. 

నిహాన్ హిడాం క్యో ( జపాన్ సంస్థ) శాంతి బహుమతి 1945 ఆగస్ట్ 6, ఆగస్టు 9 జరిగిన హీరోషిమా, నాగసాకి అను బాంబుల దాటికి ప్రాణాలతో బ్రతికి ఉన్నవారికి సేవచేస్తుందన్నందుకు నోబెల్ ఇచ్చారు.

డేరెన్ ఏస్ మోగ్లు(టర్కీ), సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ (అమెరికా) అర్థ శాస్త్రంలో ఆర్థిక అసమానుతులపై పరిశోధనకు గాను నోబెల్ వరించింది.