ఏప్రిల్​ 8న సూర్యగ్రహణం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..

వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్య మరియు చంద్రగ్రహణాలు అశుభమైనవిగా పరిగణించబడతాయి. ఈ గ్రహణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూతకకాలంలో నియమాలు పాటించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతారు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్​ 8న  సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఈ సంవత్సరం సంభవించబోయే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనది.  ఇది 54 సంవత్సరాల తర్వాత సంభవిస్తుంది. భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించదు.ఇది 12 రాశుల వారి పైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది.  సూర్యగ్రహణం ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. . .

మేషరాశి:  సూర్యగ్రహణం ఈ రాశి  వారికి శుభాలను చేకూరుస్తుంది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన మీ పనులు నిదానంగా పూర్తి అవుతాయి. కొత్త  ప్రాజెక్టులు ప్రారంభించడానికి కూడా ఈ సమయం అనుకూలమైనదని పండితులు చెబుతున్నారు. వారసత్వ రూపేణ రావలసిన డబ్బు  మీకు అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది. డబ్బును ఆదా చేయడంలో కూడా ప్రభావంతంగా ప్రవర్తిస్తారు.

వృషభరాశి:   ఈ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులు కెరీర్లో ముందుకు వెళతారు.  డబ్బులు సంపాదించడానికి కూడా అవకాశం ఉంది .పోటీ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. .రాజకీయరంగంలో ఉన్న వారు  మంచి లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టిన విజయలక్ష్మి వరిస్తుంది. 

మిధునరాశి: ఈ రాశి వారు కొత్త పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  కొత్త వాహనాలు, ఇళ్లు, భూములు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం కాదు.  ఇతరులతో మాట్లేడప్పుడు ఆచితూచి మాట్లాడాలని పండితులు సూచిస్తున్నారు. 
 మీ ఇంట్లోని పెద్దలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

కర్కాటక రాశి: 2024 వ సంవత్సరం  మొదటి సూర్యగ్రహణం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.  దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ది ఉంటుంది.  ఉద్యోగంలో ప్రమోషన్​ వచ్చే అవకాశం కలదు.. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహ రాశి: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి.   కుటుంబ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు.కీర్తి పెరుగుతుంది.  ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి.   విద్యా, ఉద్యోగ విషయాలు స్వల్ప మార్పులు వస్తాయి.  ప్రమోషన్​ వచ్చి.. స్థానచలనానికి అవకాశం కలదు.

కన్యారాశి: ఈ రాశి వారికి సూర్యగ్రహణం  అంతర్గతంగా ప్రభావం చూపుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించేందుకు ప్లాన్​ తయారు చేస్తారు.  కాని అలాంటి పనులను వాయిదా వేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు  సూచిస్తున్నారు. ఉద్యోగ విషయంలో కొన్ని ఆటుపోట్లను ఎదుర్కోవలసి వస్తుంది.  విద్యార్థులు బాగా కష్టపడితేనే రాణించగలుగుతారు. కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు.  దైవనామ స్మరణ చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. 

తులారాశి:  ఈ రాశి వారికి సూర్యగ్రహణం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి.  విదేశీ పరిచయాల వల్ల ప్రయోజనం కలుగుతుంది.  విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్​ చేసుకుంటే ఇది చాలా మంచి సమయం...అయితే అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలు సానుకూలంగా ఉంటాయి. 

వృశ్చికరాశి: ఈ రాశి వారికి కొత్తగా ఆదాయవనరులు చేకూరుతాయి.  గతంలో రావలసిన బకాయిలు వచ్చే అవకాశం ఉంది.  కొంతమంది నమ్మించి మోసం చేసే అంకాశం ఉంది.  కొత్త పెట్టు బడుడులు పెట్టేవారు.. ఆస్తి కొనేవారు డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలించాలని పండితులు సూచిస్తున్నారు.  కాంపిటేటివ్​ పరీక్షలు రాసేవారికి అనుకూల సమయం.  

ధనుస్సు రాశి:  ఈ రాశి వారు వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో బిజీగా గడుపుతారు.  కార్యాలయంలో పని ఒత్తిడి కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.మీ పనిలో వేరే వారు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు  అనుకోకుండా బదిలీ జరిగే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనిలో కొన్ని ఆటంకాలు కలిగే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. 

మకరరాశి:  ఈ రాశి వారికి  సూర్యగ్రహణం ప్రయోజనాలను అందిస్తుంది.  మీరు పిల్లలకు సంబంధించిన అద్భుతమైన వార్తలను వింటారు. పనిచేసే చోట అధికారులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. ఇది మీకు పనిలో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, డబ్బు ఆదా చేసే మార్గాల పైన కూడా మీరు ఫోకస్ పెడతారు.

కుంభ రాశి : ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఒక ప్రణాళికతో పని చేస్తారు, దీనిలో మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మీరు గట్టి ప్రయత్నాల ద్వారా విజయం సాధించే అవకాశం ఉంది. మీరు పనికి సంబంధించిన చిన్న ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు. మీ నెట్‌వర్క్ పెరుగుతుంది. కానీ మీ పనిలో ఆకస్మిక మార్పు లేదా ఆకస్మిక బదిలీకి కూడా అవకాశం ఉంటుంది.

మీనరాశి: ఈ రాశి వారికి సూర్యగ్రహణం ప్రయోజం చేకూరనుంది.  దీర్ఘకాలంగా పెండిగ్​ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.  పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.