నరాలు తెగుతున్నాయి.. బీపీలు పెరుగుతున్నాయి.. షుగర్ లెవల్స్ అప్ అండ్ డౌన్.. నిద్ర పట్టటం లేదు.. బుర్ర హీటెక్కుతుంది.. సరిగా తిండి కూడా తినటం లేదు.. ఒకటే ఆలోచన.. ఒక్కటే డిస్కషన్.. ఏపీలో ఎవరు గెలుస్తారు.. ఎవరి ఈక్వేషన్స్ ఎలా ఉన్నా.. ప్రజా తీర్పు ఆల్ రెడీ డిసైడ్ అయినా.. జూన్ 4వ తేదీ ఫలితాలు ఎలా ఉంటాయి.. ఏ పార్టీ గెలుస్తుంది.. ఇదొక్కటే ఇప్పుడు ముచ్చెమటలు పట్టిస్తుంది.. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కంటే.. పార్టీ అధినేతల కంటే.. బెట్టింగ్ పెట్టినోళ్లు పరిస్థితి ఇలాగే ఉంది.. వందలు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలకు చేరుకున్న బెట్టింగ్స్.. ఐపీఎల్ ను మించిన స్థాయిలో జరిగిన బెట్టింగ్స్ ఇప్పుడు ఏపీలో లక్షల మంది జీవితాలను తారుమారు చేయబోతున్నాయి..
పోలింగ్ ముందు నుంచే మొదలైన బెట్టింగ్స్.. ఇప్పుడు పీక్స్ కు చేరుకున్నాయి. రూపాయికి రెండు, మూడు, నాలుగు, ఐదు రూపాయల వరకు చేరింది. ఒకటికి ఒకటి అనేది మాయం అయ్యింది.. బెట్టింగ్ అంటే ఒకటికి రెండు లేకపోతే ఎలా అనే స్థాయిలో సాగింది బెట్టింగ్.
జూన్ 4వ తేదీ ఇంకా రాలేదా అనే.. ఇంకెన్ని రోజులు.. ఇంకెన్ని గంటలు అంటూ ప్రతి నిమిషం యుగంలా మారిపోయింది బెట్టింగ్ రాయుళ్ల పరిస్థితి.. కోస్తా జిల్లాలోని ఓ రాజకీయ పార్టీ నేత ఏకంగా 14 కోట్ల రూపాయలు బెట్టింగ్ కాసినట్లు ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఓ సర్వే సంస్థ ప్రతినిధి ఓ పార్టీ గెలుస్తుంది అంటూ ఏకంగా 7 కోట్ల రూపాయల బెట్టింగ్ పెట్టాడంట.. పొలానికి పొలం.. ఇంటికి ఇల్లు.. డబ్బుకు డబ్బు.. ఇలా ఆస్తులను సైతం తెగబడి మరీ బెట్టింగ్ జరగటం.. ఏపీ హిస్టరీలో హైలెట్ టాపిక్ అయ్యింది.
హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు ఏ మాత్రం తీసిపోలేదు.. సరికొత్తగా పూలింగ్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని.. 20, 30, 50, కోటి రూపాయలు అంటూ బెట్టింగ్స్ పెట్టారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేసే ఉద్యోగులు అందరూ కలిసి ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ పెట్టారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. జూన్ 4వ తేదీ దగ్గర పడే కొద్దీ టెన్షన్ తో నరాలు తెగుతున్నాయి. గెలిస్తే ఓకే.. ఓడితే పరిస్థితి ఏంటీ.. లక్షలకు లక్షలు బ్యాంక్ అకౌంట్ల నుంచి మాయం అవుతాయి.. రికవరీ ఎలా అనే ఆలోచనలు మొదలయ్యాయి.గుంటూరు, కృష్ణ జిల్లాల్లో అయితే ఒకటికి రెండు అంటూ భారీ స్థాయిలో జరిగిన బెట్టింగ్స్ మరింత కాకరేపుతున్నాయి. రెచ్చగొట్టి.. తొడలు కొట్టి.. దమ్ము చూపిస్తూ మరీ బెట్టింగ్స్ పెట్టటం అనేది ఈసారి హైలెట్ పాయింట్స్. ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా బెట్టింగ్స్ కామన్ అయినా.. ఈసారి మాత్రం గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా.. అతి సామాన్యులు సైతం బెట్టింగ్స్ లోకి దిగటం మరింత టెన్షన్ పెడుతుంది.
దీనికితోడు తేల్చుకుందాం.. తెగబడదాం.. గెలిస్తే బెంజ్ కారు.. ఓడితే బేకార్ అంతే తేడా.. అటూ ఇటూ కాకుండా ఉండటం ఎందుకు.. తాడోపేడో తేల్చుకుందాం.. గెలిస్తే కోటీశ్వర్లు అవుదాం.. ఓడితే బేకార్ గా మిగిలిపోతాం అంతే.. ఉన్నది ఒకే జీవితం అటో ఇటో ఎటో ఏదో ఒకటి తేల్చుకుందాం అన్నట్లు ఏపీలో బెట్టింగ్స్ ఆకాశాన్ని తాకే విధంగా సాగటం 2024 ఎన్నికల్లో హైలెట్.. జూన్ 4వ రిజల్ట్స్ ఎవరి జీవితాలు పైకి తీసుకెళుతుంది.. ఎవరి జీవితాలను పాతాళానికి పడగొడుతుంది అనేది తేలిపోనుంది.. మరికొన్ని గంటలు ఈ టెన్షన్ తప్పదు మరి..