వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో .. దేశానికి 11,637 కోట్ల ఆదాయం

  • వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 11 వేల కోట్లు
  • ఇండియాకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరిందన్న ఐసీసీ

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: గతేడాది ఇండియా ఆతిథ్యం ఇచ్చిన  వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  దేశానికి  రూ.11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరిందని  ఐసీసీ తెలిపింది. టోర్నీ సమయంలో  దేశ, విదేశాల పర్యాటకుల కారణంగా  టూరిజానికి అత్యధిక ఆదాయం లభించిందని పేర్కొంది.  ఈ మేరకు తమ కోసం నీల్సన్ సంస్థ నిర్వహించిన ఆర్థిక ప్రభావ (ఎకనామిక్ ఇంపాక్ట్)  నివేదికను ఐసీసీ బుధవారం వెల్లడించింది.  ‘ఐసీసీ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాకు 1.39 బిలియన్ డాలర్ల (రూ. 11,637 కోట్లు) ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది. దాంతో ఈ టోర్నీ  వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతి పెద్దదిగా నిలిచింది.  మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు భారీ సంఖ్యలో దేశ, విదేశీ పర్యాటకులు హాజరవడంతో  ఆయా నగరాల్లో  పర్యాటక రంగానికి  861.4 మిలియన్ల (రూ. 7,232 కోట్లు) ఆదాయం లభించింది. 

విదేశీయులు అనేక పర్యాటక ప్రాంతాలను సందర్శించడంతో 281.2 మిలియన్ల (రూ. 2,361 కోట్లు) ఆర్థిక ప్రభావం కలిగింది. టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమయంలో 48 వేల మంది  ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పార్ట్ టైమ్ ఉద్యోగాలతో ఉపాధి పొందారు’ అని ఐసీసీ తన  ప్రకటనలో పేర్కొంది. అయితే, నివేదికలో పేర్కొన్న భారీ మొత్తం వాస్తవ ఆదాయమా కాదా అన్నది  ఐసీసీ స్పష్టం చేయలేదు. గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.