ఆడి క్యూ7లో లేటెస్ట్ వెర్షన్‌‌

ఆడి క్యూ7లో లేటెస్ట్ వెర్షన్‌‌

న్యూఢిల్లీ: ఫ్లాగ్‌‌షిప్‌‌ మోడల్‌‌ క్యూ7లో లేటెస్ట్ వెర్షన్‌‌ను లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి లాంచ్ చేసింది. ఈ వెహికల్ ధర రూ. 79.99 లక్షల (ఎక్స్‌‌ షోరూమ్‌‌) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారును లోకల్‌‌గానే అసెంబుల్ చేశారు. ఆడి క్యూ7 లేటెస్ట్‌‌ వెర్షన్‌‌లో 3 లీటర్‌‌‌‌ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు గంటకు 0–100 కి.మీ స్పీడ్‌‌ను 5.9 సెకెన్లలో చేరుకోగలదు. ఈ కారు రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.  క్యూ7 ప్రీమియం  ప్లస్ ధర రూ. 79.99 లక్షలు కాగా, క్యూ7 టెక్నాలజీ ధర రూ.88.33 లక్షలు.