న్యూఢిల్లీ: ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు చెబుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ వీడియోను విడుదల చేశారు. కరోనా ఆపత్కాలంలో సేవలందిస్తున్న మెడికల్ వర్కర్స్‌ను కేజ్రీవాల్ ప్రశంసించారు. ఏడాది మాత్రమే ముగిసిందని, కరోనా మహమ్మారి అంతమవ్వలేదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలని కోరారు.
कोरोना महामारी के बीच इस बार नया साल नई उम्मीदों और नई आकांक्षाओं को लेकर आ रहा है। सभी देशवासियों को नए साल की ढेरों शुभकामनाएं। pic.twitter.com/vmhJIU9I4N
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 1, 2021
‘గత ఏడాది భారత్‌తోపాటు అన్ని దేశాలూ కష్టాలను ఎదుర్కొన్నాయి. మొత్తం మానవాళి అతి భయంకరమైన మహమ్మారితో పోరాడింది. కరోనా వారియర్స్‌కు సెల్యూట్ చేస్తున్నా. కఠిన పరిస్థితుల్లో ప్రజాసేవలో నిమగ్నమైన డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టాఫ్, సఫాయి కార్మికులు, ధార్మిక సంస్థలకు ధన్యవాదాలు. కరోనాను ఎదుర్కోవడంలో దీటుగా పోరాడుతామని ఢిల్లీ నిరూపించింది. మేం తీసుకొచ్చిన కొన్ని విధానాలను చాలా దేశాలు పాటించాయి. కొత్త ఏడాది వేళ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. గడిచింది సంవత్సరం మాత్రమేనని కరోనా కథ ముగియలేదని తెలుసుకోవాలి. మనం సావధానంగా ఉండాలి. కరోనా నుంచి రక్షించుకునేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలనూ పాటించాలి. భారత్‌లో త్వరలో వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నా. పరిస్థితులు ఒకప్పటిలాగే మామూలు స్థితికి చేరుకుంటాయని నమ్ముతున్నా. అప్పటివరకు జాగ్రత్తలు పాటిద్దాం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
