పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు

కోస్గి, వెలుగు :  పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ నారాయణపేట జిల్లా ఫాస్ట్‌‌ ట్రాక్‌‌ కోర్టు ఇన్‌‌చార్జి జడ్జి మహ్మద్‌‌ రఫీ తీర్పు చెప్పారు. నారాయణ పేట ఎస్పీ యోగేశ్‌‌ గౌతమ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... కోస్గి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను పాలమూరు పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్ తరుణ్‌‌ ప్రేమ పేరుతో నమ్మించాడు. 

గతేడాది మే 31న బాలికను ఆటోలో ఎక్కించుకొని హైదరాబాద్‌‌లోని లంగర్‌‌హౌస్‌‌లోని ఓ రూమ్‌‌కు తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై లైంగికదాడి చేశాడు. అదే రోజు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై శ్రీనివాసులు కేసు నమోదు చేసి తరుణ్‌‌ను అరెస్ట్‌‌ చేశారు. విచారణ అనంతరం నిందితుడిపై నేరం నిరూపణ కావడంతో తరుణ్‌‌కు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులు, కోర్టు సిబ్బంది, పీపీని ఎస్పీ అభినందించారు.