అక్షయ పాత్ర భోజనం తిన్న విద్యార్ధులకు అస్వస్థత

అక్షయ పాత్ర భోజనం తిన్న విద్యార్ధులకు అస్వస్థత

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని రామకృష్ణ మిషన్ స్కూల్ కు చెందిన 20 మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం అక్షయ పాత్ర భోజన పథకంలో భాగంగా పప్పు ,పచ్చడి తిన్న పిల్లలకు.. అకస్మాత్తుగా వాంతులు, విరోచనాలయ్యాయి. చిన్నజీఆయర్ స్వామి ట్రస్ట్ ఆశ్రమానికి చెందిన రామకృష్ణ మిషన్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది.  స్కూల్ యాజమాన్యం వెంటనే వారందరిని తాడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు.