పెబ్బేరులో 20 కిలోల చేప లభ్యం

పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు చెరువులో మత్స్యకారులకు భారీ చేప దొరికింది. పెబ్బేరు ఊర చెరువులో కొన్నిరోజులుగా మత్స్యకారులు చేపలు పడుతున్నారు. శుక్రవారం భారీ సంఖ్యలో చేపలు చిక్కగా అందులో 20 కిలోల బరువు ఉన్న వాలుగ అనే రకం చేప వలలో పడింది. భారీ చేప దొరకడంతో మత్స్యకారులు, ముదిరాజ్‌‌లు ఆనందం వ్యక్తం చేశారు.