కుమ్మరోనిపల్లి గ్రామాంలో .. పిడుగు పాటుతో 20 జీవాలు మృతి

అమ్రాబాద్, వెలుగు: వర్షంతో పాటు పిడుగు పడి ఆదివారం 20 గొర్రెలు, మేకలు చనిపోయాయి. అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి గ్రామానికి చెందిన మేడమోని నారయ్య, బినమోని బాలయ్యకు చెందిన గొర్రెలు, మేకలను సమీప అడవిలోకి మేత కోసం తీసుకెళ్లగా. సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం రావడంతో మేకలు, గొర్రెలు చింత చెట్టు కిందకు తీ సుకెళ్లారు. 

అదే సమయంలో పిడుగు పడడంతో 20 మేకలు, గొర్రెలు చనిపోయాయి. దీంతో రూ.2 లక్షల వరకు నష్టపోయామని బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు.