దేశంలో కొత్త రకం వైరస్ బాధితుల సంఖ్య 20కి చేరింది. మరో 14 మందికి కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీ NCDCలో 14 శాంపిల్స్ పరీక్షించగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకూ కోల్ కతా, పూణేలో ఒక్కో కేసు నిర్ధారణ కాగా…బెంగళూరులో 7, హైదరాబాద్ లో 2, ఢిల్లీ IGIBలో మరో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. ఓవర్ ఆల్ గా మొత్తం 107 శాంపిల్స్ పరీక్షించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
యూకే నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ వస్తే జీనోమ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం దేశంలో 10 ల్యాబ్ లు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య UK నుంచి భారత్ కు 33 వేల మంది వచ్చారు. వీరిలో ఇప్పటి వరకు 20 మందికి కరోనా కొత్త స్ట్రెయిన్ బయటపడింది. వీరిని సింగిల్ రూమ్ ఐసోలేషన్ లో ఉంచిన రాష్ట్ర ప్రభుత్వాలు.. వారితో కంటాక్ట్ అయినవారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
2020 అద్భుతమైన పాఠాలు నేర్పింది
