బొమ్మ కార్లతో ఆడుకునే వయసు. కానీ పెద్ద కార్లతో ఓ ఆటాడేస్తున్నడు దేవామ్ నారాయణం. వయసు రెండేళ్లు. ఊరు హైదరాబాద్ . కానీ, ప్రపంచంలోని ఏ మూలన తిరిగే కారయినా సరే.. చూపిస్తే చాలు దాని పేరు చెప్పేస్తడు. బ్రాండ్ పేరు చెబితే ఆ మోడల్ ని గుర్తుపడుతడు.
రెండేళ్ల వయస్సుకే అసాధారణమైన తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నడు దేవామ్ నారాయణం. అద్భుతమైన జ్ఞా పకశక్తితో ప్రపంచంలోని 100కు పైగా ప్రముఖ కార్ల బ్రాండ్లను గుర్తుపడుతూ, వాటి పేర్లను ఈజీగా చెప్పేస్తున్నడు. దేవామ్ పేరెంట్స్ అమెరికా టూర్లో ఉన్నప్పుడు వాడి టాలెంట్ ని గుర్తించారు. అప్పటికి అతని వయసు ఏడాది. అక్కడ కనిపించే రకరకాల కార్లు చూసి వాటిని గుర్తుపట్టేసేవాడట. సరిగా నడవలేని ఆ వయసులో కారు శబ్దం వినిపిస్తే దానిని చేరుకోవాలని ప్రయత్నం చేసేవాడట. పెరుగుతున్న కొద్దీ కార్ల మీద ఇంట్రస్ట్ పెంచుకున్నడు. పలు కంపెనీలు తయారు చేసిన కార్ మోడల్స్‌ని ఎంతో ఆసక్తిగా వినేటోడు. వాటిని మళ్లీ చూస్తే ఆ బ్రాండ్ , మోడల్ పేరు చెప్పేటోడట. తోటి పిల్లలెవరికీ రాని ఈ పేర్లు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారట. ఇప్పుడు తన వద్ద చాలా రకాల కార్ల బొమ్మలు ఉన్నాయి, రోజంతా వాటితో ఆడుకుంటాడు.

