ప్లాస్టిక్‌‌‌‌ బాటిల్‌‌‌‌ వాడినందుకు రూ. 2 వేలు ఫైన్‌‌‌‌

అమ్రాబాద్, వెలుగు : అమ్రాబాద్‌‌‌‌ టైగర్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ను ప్లాస్టిక్  ఫ్రీగా మార్చేందుకు ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌‌‌‌ వస్తువులు అమ్మొద్దంటూ శ్రీశైలం–హైదారాబాద్‌‌‌‌ ప్రధాన రహదారిపై ఉన్న షాప్ ఓనర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కుర్‌‌‌‌ కురే, ప్లాస్టిక్‌‌‌‌ కవర్లు ఉన్న బిస్కట్‌‌‌‌ ప్యాకెట్లు, హాఫ్‌‌‌‌ లీటర్‌‌‌‌, లీటర్‌‌‌‌ వాటర్‌‌‌‌ బాటిళ్లు, ఇతర కూల్‌‌‌‌ డ్రిక్స్‌‌‌‌ బాటిళ్లను నిషేధించారు. రెండు లీటర్ల వాటర్‌‌‌‌ బాటిల్స్‌‌‌‌కు మాత్రం పర్మిషన్‌‌‌‌ ఇచ్చారు.

ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చే ప్లాస్టిక్‌‌‌‌ వాటర్‌‌‌‌ బాటిల్స్‌‌‌‌ను సైతం మన్ననూరు చెక్‌‌‌‌పోస్ట్‌‌‌‌ వద్ద స్వాధీనం చేసుకొని తిరుగు ప్రయాణంలో అందిస్తున్నారు. అలాగే ఫారెస్ట్‌‌‌‌ పెట్రోలింగ్‌‌‌‌ సిబ్బంది శ్రీశైలం రహదారి వెంట తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సోమవారం మహారాష్ట్రకు చెందిన దినేశ్‌‌‌‌ మంగళ్‌‌‌‌ అనే వ్యక్తి బహిర్భూమి కోసం ప్లాస్టిక బాటిల్‌‌‌‌లో నీళ్లు తీసుకొని అడవిలోకి వెళ్లాడు. గమనించిన ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు అతడికి రూ. 2 వేల ఫైన్‌‌‌‌ విధించారు.