పూంఛ్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అనుకోకుండా భారత్ బార్డర్‌లోకి ప్రవేశించారు. జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఆ బాలికలు భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆదివారం పొద్దున ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సదరు బాలికలు పీవోకేలోని అబ్బాస్‌పూర్‌కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. వాళ్లు సరిహద్దులను దాటడాన్ని మన బలగాలు గుర్తించాయని, వారికి ఎలాంటి హాని తలపెట్టలేదని ఆర్మీ తెలిపింది. బాలికలను తిరిగి స్వదేశానికి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.
Two girls from PoK had inadvertently crossed into Indian territory in Poonch, Jammu & Kashmir today morning. Our troops detected them crossing & exercised complete restraint to prevent any harm to the teenagers. Efforts are being made for their repatriation: Defence PRO, Jammu
— ANI (@ANI) December 6, 2020
