చికెన్ బిర్యానీ తెగ తిన్నరు..
ఇళ్ల వద్దకే డెలివరీ చేశామన్న స్విగ్గీ
బెంగళూరు: ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీపై ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్‌లో చికెన్ బిర్యానీ ఉన్నట్టు స్టాట్‌ఈట్‌స్టిక్స్ రిపోర్ట్ 5వ ఎడిషన్ తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన 3 లక్షల మందికి పైగా కొత్త యూజర్లు చికెన్ బిర్యానీనే ఆర్డర్ చేసినట్టు పేర్కొంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్ని రకాలుగా తీసుకున్న ప్రతి సెకనుకు ఒకటికి పైగా ఎక్కువ బిర్యానీలు ఆర్డర్ అయినట్టు తెలిపింది. వెజ్, చికెన్ బిర్యానీల ఆర్డర్ల రేషియో 1:6గా ఉంది. కరోనా మహమ్మారితో ఆఫీసులు మూతపడటంతో ఎక్కువ ఆర్డర్లను ఇళ్ల వద్దకే డెలివరీ చేసినట్టు స్విగ్గీ వెల్లడించింది. చికెన్ బిర్యానీ తర్వాత మసాలా దోస, పన్నీర్ బట్టర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, గార్లిక్ బ్రెడ్‌స్టిక్స్ టాప్ ఆర్డర్లలో ఉన్నాయి. హెల్తీ మీల్స్‌కు కూడా డిమాండ్ పెరిగినట్టు స్విగ్గీ తెలిపింది. ఈ ఏడాది స్విగ్గీ 6 లక్షలకు పైగా కేక్స్‌ను డెలివరీ చేసింది. లాక్‌డౌన్‌లో బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకున్న చాలా మంది స్విగ్గీలో కేక్స్‌ను ఆర్డర్ చేశారు. లాక్‌డౌన్ కాలం నుంచి పానీ పూరికి 2 లక్షల ఆర్డర్లు వచ్చాయి. స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు ఇద్దరు కస్టమర్లు అత్యధికంగా రూ.5 వేల చొప్పున టిప్ ఇచ్చారు. స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు అందుకున్న అత్యధిక టిప్ ఇదే కావడం విశేషం.
ఉల్లిగడ్డలు ఎక్కువ ఆర్డర్ చేశారు…
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి గ్రోసరీలను కూడా స్విగ్గీ ఎగ్జిక్యూటివ్‌లు డెలివరీ చేశారు. ఈ ఏడాది ఆగస్ట్‌లోనే గ్రోసరీలు, ఎసెన్షియల్ డెలివరీ సర్వీసుల కోసం స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ను తెచ్చింది. ఇన్‌స్టామార్ట్ ద్వారా 1.6 లక్షల మీల్ కిట్స్‌ను స్విగ్గీ డెలివరీ చేసింది. అదేవిధంగా యూజర్లు కూడా 75 వేల కిలోల ఉల్లిగడ్డలను ఆర్డర్ చేశారు. ఇన్‌స్టామార్ట్‌లో ఎక్కువ ఆర్డర్ చేసిన ఐటమ్‌గా ఉల్లిగడ్డలు నిలిచాయి. 2020 జనవరి నుంచి డిసెంబర్ వరకు స్విగ్గీ ఆర్డర్లపై స్టాట్‌ఈట్‌స్టిక్స్ అనాలసిస్ చేసింది. స్విగ్గీ లక్ష రెస్టారెంట్ పార్టనర్లు, స్టోర్లతో కలిసి పనిచేస్తోంది.
For More News..
అప్పిచ్చే యాప్స్‌తో జర జాగ్రత్త
టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కొంతే.. చేయాల్సింది ఎంతో
బీజేపీ అధికారంలోకి వస్తే జూరాల లిఫ్ట్ కట్టి తీరుతం
