ఫర్టిలైజర్ కంపెనీలో గ్యాస్ లీకేజీ.. ఇద్దరు మృతి

ఫర్టిలైజర్ కంపెనీలో గ్యాస్ లీకేజీ.. ఇద్దరు మృతి
ప్రయాగ్‌‌రాజ్: ఉత్తర్ ప్రదేశ్‌‌లో భారీ గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌‌రాజ్, ఫూల్‌‌పూర్‌లోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్స్ (ఇఫ్కో)లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన ఉద్యోగులను వీపీ సింగ్, అభ్యనందన్ కుమార్‌‌గా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరగొచ్చునని ప్రయాగ్‌‌రాజ్ డీఎం భాను చంద్ర గోస్వామి తెలిపారు. గ్యాస్ లీకేజీని నిలిపివేశామని, తాత్కాలికంగా ప్లాంట్‌‌ను మూసేసినట్లు గోస్వామి చెప్పారు. ప్రాథమిక విచారణ ప్రకారం పైప్ లీక్ వల్లే ఈ ప్రమాదం తలెత్తిందని తెలుస్తోంది.