36 ఏండ్ల తర్వాత..ఇండియా గడ్డపై న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు టెస్టు విజయం

  • తొలి టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 8 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలుపు
  • రాణించిన విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌, రచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర
  •  బుమ్రాకు రెండు వికెట్లు

బెంగళూరు : అద్భుతం జరగలేదు. తొలి టెస్టులో టీమిండియాకు ఓటమి తప్పలేదు. తొలి స్పెల్‌‌‌‌‌‌‌‌లో  వణికించిన  స్పీడ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా (2/29)  పేస్ దాడిని తట్టుకొని నిలబడిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ 36 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియా గడ్డపై టెస్టు విజయాన్ని అందుకుంది. బెంగళూరులో ఆదివారం, ఐదో రోజు ముగిసిన   మొదటి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా ఇచ్చిన 107 రన్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కివీస్ రెండు వికెట్లు కోల్పోయి ఛేజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. బుమ్రా దెబ్బకు టామ్ లాథమ్ (0), డెవాన్ కాన్వే (17) ఔటైనా  విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ (48 నాటౌట్‌‌‌‌‌‌‌‌)

రచిన్ రవీంద్ర (39 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 75 రన్స్ జోడించి తమ జట్టును గెలిపించారు. దాంతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో కివీస్‌‌‌‌‌‌‌‌ 1–0తో ఆధిక్యం సంపాదించింది. రెండు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో ఆకట్టుకున్న రచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్రకు ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 24 నుంచి పుణెలో జరుగుతుంది.

బుమ్రా ఆశలు రేపినా

చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 0/0తో ఆట కొనసాగించిన కివీస్‌‌‌‌‌‌‌‌కు తొలి స్పెల్‌‌‌‌‌‌‌‌లో బుమ్రాతో  చుక్కలు చూపెట్టాడు.  మేఘావృత వాతావరణంలో ఆట మొదలైన రెండో బాల్‌‌‌‌‌‌‌‌కే  లాథమ్‌‌‌‌‌‌‌‌ను అద్భుతమైన ఇన్‌‌‌‌‌‌‌‌ స్వింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎల్బీగా ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దీనికి కివీస్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నా ఫలితం లేకపోయింది.  ఆరంభంలోనే వికెట్ పడటంతో ఇండియా విజయంపై ఆశలు రేగాయి. రెండు ఎండ్ల నుంచి బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌ పదునైన బాల్స్‌‌‌‌‌‌‌‌ వేశారు. క్రీజులో ఉన్నంతసేపు మరో ఓపెనర్ కాన్వే తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కొన్ని బాల్స్ అతని శరీరానికి కూడా తాకాయి.

వన్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌హెల్మెట్‌‌‌‌కు ఓ బాల్ తగిలింది. చివరకు బుమ్రా వేసిన 14వ ఓవర్లో కాన్వే వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో కివీస్‌‌‌‌‌‌‌‌ 35/2తో నిలిచింది. బుమ్రా, సిరాజ్‌‌‌‌‌‌‌‌ మెప్పిస్తున్నా మూడో పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడం ఇండియా అవకాశాలను దెబ్బతీసింది. క్రీజులో కుదురుకున్న విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌కు ఫామ్‌‌‌‌లో ఉన్న  రచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర తోడయ్యాడు. ఎండ వచ్చిన తర్వాత ఈ ఇద్దరూ  స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

క్రమం తప్పకుండా బౌండ్రీలు కొడుతూ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కరిగించారు.  నోబాల్‌‌‌‌‌‌‌‌తో బౌలింగ్‌‌‌‌‌‌‌‌ ఆరంభించిన జడేజా ప్రభావం చూపలేకపోయాడు. తన తొలి రెండు ఓవర్లలోనే 14 రన్స్ ఇచ్చుకున్నాడు. టార్గెట్‌‌‌‌‌‌‌‌ తగ్గిపోయిన తర్వాత కివీస్ బ్యాటర్లు మరింత స్వేచ్ఛగా షాట్లు ఆడారు. కుల్దీప్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో యంగ్‌‌‌‌‌‌‌‌ భారీ సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. జడేజా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో  ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ముగించాడు. 


3 ఇండియాలో ఆడిన 37 టెస్టుల్లో  న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు ఇది మూడో విజయం. ఇది వరకు 1969 నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, 1988లో ముంబైలో గెలిచింది.

24 ఇండియా గడ్డపై వంద రన్స్ పైచిలుకు టార్గెట్‌‌‌‌‌‌‌‌ను పర్యాటక జట్టు ఛేదించడం 24 ఏండ్లలో ఇదే తొలిసారి. చివరగా 2000లో సౌతాఫ్రికా ఈ ఘనత సాధించింది. ఈ మధ్య లో 32 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 23 సార్లు 100 పైచిలుకు టార్గెట్లను ఇండియా కాపాడుకొని గెలిచింది. మరో తొమ్మిది మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు డ్రా అయ్యాయి.24

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ : 46 ఆలౌట్‌‌‌‌‌‌‌‌;  న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ : 402 ఆలౌట్‌‌‌‌‌‌‌‌; ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ : 462 ఆలౌట్ ;  న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ (టార్గెట్‌‌‌‌‌‌‌‌ 107) : 27.4 ఓవర్లలో 110/2 (విల్ యంగ్ 48 నాటౌట్‌‌‌‌‌‌‌‌, రవీంద్ర 39 నాటౌట్‌‌‌‌‌‌‌‌, బుమ్రా 2/29).