మాజీ క్రికేటర్, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నవజ్యోత్ సింగ్ సిద్ధూ లొంగిపోయారు. 34 ఏళ్ల నాటి కేసులో నవజోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే.. లొంగిపోవడం విషయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనకు కొంత సమయం ఇవ్వాలని కోరుతూ.. సిద్ధూ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అత్యవసర పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. దీంతో అతను లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంజాబ్ లోని పాటియాల కోర్టులో లొంగిపోయారు. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పాటియాల జైలుకు తరలించనున్నారు. కోర్టు తీర్పున అనంతరం చట్టాన్ని గౌరవిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే.
అంతకుముందు తనకు ఆరోగ్యం బాగా లేదని.. లొంగిపోవడానికి కొంత సమయం కావాలని సిద్ధూ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అత్యవసరంగా విచారించడం కుదరదని తేల్చిచెప్పడంతో ఆయన లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు తీర్పు అనంతరం గురువారం సిద్ధూ పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పును గౌరవిస్తానని, లొంగిపోతానని వెల్లడించారు. అనూహ్యంగా ఆరోగ్య రీత్యా లొంగిపోవడానికి మరికొన్ని వారాలు సమయం కావాలని కోర్టును సిద్ధూ ఆశ్రయించడం గమనార్హం.
34 ఏళ్ల నాటి కేసులో నవజోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల క్రితం పాటియాలాలో కారు పార్కింగ్ విషయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో సిద్ధూ, అతడి అనుచరుడు రూపీందర్ సింగ్ సంధులు గొడవ పడి తీవ్రంగా గాయపరిచారు. దీంతో తీవ్ర గాయలపాలైన గుర్నామ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 1999లో ఈ కేసు విచారించిన పాటియాలా సెషన్స్ కోర్టు... సాక్ష్యాలు లేవంటూ సిద్ధూ, అతడి అనుచరుడిని నిర్దోషులుగా ప్రకటించింది.
మృతుడి కుటుంబ సభ్యులు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశారు. 2006లో ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం సిద్ధూకు మూడేళ్ల జైలు శిక్షవిధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుదీర్ఘ కాలం కొనసాగిన ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు... ఆయనకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.
మరిన్ని వార్తల కోసం : -
ఆరోగ్యం బాగాలేదు.. లొంగిపోయేందుకు సమయం కావాలన్న సిద్ధూ
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కుటుంబ పార్టీలపై పోరాడాలి
