పట్టపగలు పెట్రోల్ బంక్ నుంచి అమ్మాయి కిడ్నాప్

పట్టపగలు పెట్రోల్ బంక్ నుంచి అమ్మాయి కిడ్నాప్



 

మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో సోమవారం ( నవంబర్ 20)  షాకింగ్ సంఘటన జరిగింది. ఝాన్సీ రోడ్ బస్టాండ్ వద్ద ఓ మహిళ కిడ్నాప్ అయింది. ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు ఆ మహిళను కిడ్నాప్ చేసిన ఘటన సీసీటీవీలో రికార్డైంది. రద్దీగా ఉండే ఝాన్సీ రోడ్ బస్టాండ్ లో దృశ్యాలు సీసీటీవి కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పట్టపగలే అంతా చూస్తుండగా ఒక యువతిని కిడ్నాప్‌ చేశారు. పెట్రోల్‌ బంకు వద్ద ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్‌ అయ్యింది. (Woman Kidnapped From Petrol Pump) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ( నవంబర్ 20)  స్థానిక పెట్రోల్‌ బంకు వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. అక్కడ ఉన్న 19 ఏళ్ల యువతిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని కిడ్నాప్‌ చేశారు. స్థానికులు స్పందించేలోపు బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఒక వ్యక్తి తలకు హెల్మెట్‌ పెట్టుకోగా, మరో వ్యక్తి ముఖానికి క్లాత్‌ చుట్టుకున్నాడు.

కాగా, కిడ్నాప్‌ అయిన యువతి బింధ్‌ జిల్లాకు చెందినట్లు పోలీసులు తెలిపారు. బీఏ చదువుతున్న ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకునేందుకు బింధ్‌ వెళ్లినట్లు చెప్పారు. సోమవారం  ( నవంబర్ 20)  బస్సు దిగిన ఆ యువతి సోదరుడి కోసం పెట్రోల్‌ బంకు వద్ద వేచి ఉండగా ఆమెను కిడ్నాప్ చేసినట్లు తెలిసిందన్నారు. కేసు నమోదు చేసి యువతి, కిడ్నాపర్ల కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆ పెట్రోల్‌ బంకు వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.