మహా ధనవంతుల దగ్గర  క్రిప్టోలు పెరిగిన​య్‌‌‌‌‌‌‌‌.!

మహా ధనవంతుల దగ్గర  క్రిప్టోలు పెరిగిన​య్‌‌‌‌‌‌‌‌.!
  •     రష్యా‑ఉక్రెయిన్ యుద్ధంతో క్రిప్టో కరెన్సీల వైపు చూస్తున్న ధనవంతులు
  •     11 శాతం మంది ఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీలో ఇన్వెస్ట్ చేశారని అంచనా: నైట్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంక్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌


న్యూఢిల్లీ: దేశంలోని మహా ధనవంతులు క్రిప్టో కరెన్సీల వైపు చూడడం పెరిగింది.  రష్యా–ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యుద్ధంతో  క్రిప్టో కరెన్సీల్లో వొలటాలిటీ (కదలికలు) ఎక్కువైంది. దీని నుంచి లాభపడడానికి మహా ధనవంతులు తమ క్రిప్టో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను పెంచుకున్నారని నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రాంక్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. దేశంలోని 18 శాతం మంది మహా ధనవంతుల దగ్గర క్రిప్టో కరెన్సీలు లేదా టోకెన్లు ఉన్నాయని  పేర్కొంది. 11 శాతం మంది ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ (నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫంగిబుల్ టోకెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లలో ఇన్వెస్ట్ చేశారని లెక్కించింది. పెద్ద పెద్ద  కంపెనీలు  క్రిప్టో, బ్లాక్ చెయిన్ టెక్నాలజీలలోకి ఎంటర్ అవుతుండడంతో  క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు  ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. తాజాగా ఐటీ కంపెనీ టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహీంద్రా టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంవెర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద మెటావర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే. టీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీలు మెటావర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విస్తరించేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నాయి.   ‘జీడీపీ పెరగడంలో క్రిప్టోలు కీలకం. రానున్న కాలంలో ఈ ఇండస్ట్రీ మరింత ఎదుగుతుంది.  ఈ డిజిటల్ అసెట్లలో మరిన్ని రకాలు వస్తాయి.  క్రిప్టో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లకు కిందటేడాది కలిసొచ్చింది. కంపెనీలు వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2.0 నుంచి వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3.0 ఐడియాలకు షిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయి. కిందటేడాది చివరి నాటికి గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్రిప్టో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్యూ 2.4 ట్రిలియన్ డాలర్లు. ఇది 2020 తో పోలిస్తే 12 రెట్లు ఎక్కువ. ఈ సెక్టార్ మరింత పెరుగుతుంది’ అని నైట్ ఫ్రాంక్ తన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెల్లడించింది.