17 ఏళ్ల హర్యానా స్టూడెంట్ కు డయానా అవార్డు

హర్యానాలోని గురుగ్రామ్​కు చెందిన అన్వికుమార్​ భారతదేశంలో మానసిక ఆరోగ్య విద్యలో పాజిటివ్​ పరివర్తన తీసుకురావడానికి చేసిన కృషికిగాను ప్రతిష్టాత్మక డయానా అవార్డు లభించింది. 

  •     అన్వికుమార్​ మైండ్​ కాన్వాస్​ కార్యక్రమం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కృషి చేశారు. మానసిక సమస్యలతో సతమతమయ్యే వారు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడటానికి కథలు చెప్పడాన్ని అనుసరించారు. మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాల్లో అంతరాలను గుర్తించారు. 
  •     మానవతావాద లేదా సాంఘికపరమైన కార్యక్రమాలతో మంచి మార్పు కోసం కృషి చేసే యువతకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 
  •     వేల్స్​ ప్రిన్సెస్​ డయానా స్మారకార్థం ఈ పురస్కారాన్ని 1999లో ఏర్పాటు చేశారు.