బోటు ప్రమాదం: 17కు చేరిన మృతుల సంఖ్య

బోటు ప్రమాదం:  17కు చేరిన మృతుల సంఖ్య

తూర్పుగోదావరి జిల్లాలో ఆపరేషన్ దేవీపట్నం కొనసాగుతోంది. కచ్చులూరు దగ్గర లాంచీ మునిగిన ఘటనలో చనిపోయినవారి సంఖ్య 17కు చేరింది. నిన్నటి వరకు 8 మంది మృతదేహాలను వెలికితీసిన NDRF సిబ్బంది.. ఇవాళ ఉదయం మరో ఐదు మృత దేహాలను గుర్తించారు. కాపర్ డ్యాం వద్ద ఒకటి… మూపపాడు దగ్గర మరోటి, ధవళేశ్వరం వద్ద ఒక మృతదేహం లభ్యం అయ్యింది.

ప్రమాదంలో ఇప్పటి వరకు 27 మంది సేఫ్ గా బయటపడ్డారు. నదిలో గల్లంతైన మరో 24 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. 72 మందితో దేవీపట్నం మండలం గండిపోచమ్మ దగ్గర నుంచి టూరిస్టు బోటు పాపికొండల టూర్ కు వెళ్లింది. దేవీపట్నం చెక్ పాయింట్ దాటి కచ్చులూరు దగ్గరికి చేరగానే వరద ప్రవాహానికి బోటు మునిగింది. అయితే గాలింపు చర్యల కోసం ఉదయం జార్ఖండ్, ఛత్తీస్ గడ్ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు.