లోక్ అదాలత్‌‌లో 1,57,088 కేసులు పరిష్కారం

హైదరాబాద్, వెలుగు: ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరే కేసులను సామరస్యంగా పరిష్కరిస్తున్నామని డీజీపీ కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌‌ అదాలత్‌‌లో మొత్తం 1,57,088 కేసులు పరిష్కారం అయినట్టు తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరుపక్షాల అంగీకారంతో రాజీకి అర్హమైన కేసులను పరిష్కరించినట్టు అధికారులు పేర్కొన్నారు. 

ఇందులో ఈపెటీ కేసులు 74,767, మోటార్‌‌ వెహికల్‌‌ యాక్ట్‌‌ కేసులు కాగా, 59,438, డిజాస్టర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కేసులు 2,131, ఇతర కేసులు 20,752 ఉన్నట్టు తెలిపారు. అత్యధిక కేసులు పరిష్కారం అయిన మొదటి ఐదు స్థానాల్లో హైదరాబాద్‌‌ కమిషనరేట్‌‌(24,546 కేసులు), సైబరాబాద్‌‌ (12,797 కేసులు), రాచకొండ కమిషనరేట్‌‌ (11,083 కేసులు), సూర్యాపేట (10,951 కేసులు), నిజామాబాద్‌‌ (10,246 కేసులు) ఉన్నాయని డీజీపీ కార్యాలయ అధికారులు వెల్లడించారు.