చిత్రపురి కాలనీలో మహిళపై 15 కుక్కల‌ దాడి

రంగారెడ్డి జిల్లాలో వెన్నులో దడ పుట్టించే ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడికి ప్రయత్నించాయి. సదరు మహిళ ప్రతిఘటించడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ భయాందోళనకు గురిచేస్తున్నాయి. 

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపూరి కాలనీలో  కారు పార్కింగ్ వద్ద స్కూటీపై వచ్చిన ఓ మహిళపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా15 కుక్కల‌ు దాడి చేశాయి. కుక్కలను వెళ్లగొట్టేందుకు బాధిత మహిళ ఎంతో ప్రయత్నం చేసింది. మరింతగా రెచ్చిపోయి.. పైపైకి వచ్చి దాడి చేసేందుకు వీధి కుక్కలు ప్రయత్నించాయి. దాదాపు అర గంట పాటు వీధి కుక్కలతో పోరాడి ప్రాణాలు దక్కించుకుంది. కుక్కల దాడికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

 ఒకేసారి 15 కుక్కలు మహిళపై దాడికి బ్రాంతులకు గురైన చిత్రపురి కాలనీ వాసులు.. వీధి కుక్కల బారి నుండి కాపాడాలంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో అదే ప్రాంతంలో తల్లి కొడుకుపై విచక్షణా రహితంగా వీధి కుక్కలు దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఘటనతో ఒక్క రోజు మాత్రమే హడావుడి చేసిన అధికారులు.. ఆ తర్వాత పట్టించుకోలేదని కాలనీ వాసులు మండిపడ్డారు. వీధి‌ కుక్కలను గాలికి వదిలేసి.. ప్రాణాలు పోతున్నా న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.