లోక్సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్

లోక్సభలో మరో 49 మంది ఎంపీలు సస్పెండ్

లోక్ సభలో దాడిపై పార్లమెంట్ దద్దరిల్లుతోంది. దాడిపై కేంద్రహోంమంత్రి  ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు సభలో పట్టుబడుతున్నాయి. దీంతో  డిసెంబర్ 19న మరో 49 మంది విపక్ష ఎంపీలను  స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్స్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.  సుప్రియా సూలే, ఫరూక్ అబ్దుల్లా, శశి థరూర్, కార్తి చిదంబరం, డింపుల్ యాదవ్, మనీశ్ తివారీ సస్పెన్షన్ కు గురైన వారిలో ఉన్నారు. 

లోక్ సభలో ఇప్పటి  వరకు 141 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గత వారం 13 మంది ఎంపీలు,  డిసెంబర్ 18న 33 మంది ఎంపీలు,  తాజాగా 49తో కలిపి మొత్తం లోక్ సభలో 95 మంది వేటుకు గురయ్యారు. రాజ్యసభలో లో  ఇప్పటి వరకు 46 మందిని సస్పెండ్ చేశారు. దీంతో ఉభయ సభల్లో ఇప్పటి వరకు మొత్తం 141 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు.  పార్లమెంట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని చెప్పవచ్చు.  డిసెంబర్ 22తో ఈ సమావేశాలు ముగియనున్నాయి.