న్యూఢిల్లీ: డిసెంబర్ 31 న రికార్డ్ లెవెల్‌లో వాట్సాప్ కాల్స్ జరిగాయని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఈ ఒక్క రోజే వాట్సాప్ ద్వారా గ్లోబల్‌గా 140 కోట్ల వాయిస్, వీడియో కాల్స్ జరిగాయని పేర్కొంది. ఒకే రోజులో ఇంత పెద్ద మొత్తంలో కాల్స్ జరగడం ఇదే మొదటి సారి అని తెలిపింది. కిందటేడాది డిసెంబర్ 31 న నమోదైన వాట్సాప్ కాల్స్ కంటే ఈ సారి 50 శాతం ఎక్కువ కాల్స్ జరిగాయని పేర్కొంది. ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా కూడా వీడియో, గ్రూప్ వీడియో కాల్స్ ఎక్కువగా నమోదయ్యాయని, డిసెంబర్ 31 న గ్లోబల్‌గా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో 5.5 కోట్ల లైవ్ బ్రాడ్ కాస్ట్‌లు జరిగాయని ఫేస్‌బుక్ ప్రకటించింది.
for more News..
కరోనా లాక్‌డౌన్ టైమ్ కుటుంబాలకు మేలే చేసింది
హైదరాబాద్‌లో చెట్టు కొట్టేసినందుకు రూ. 10 వేల ఫైన్
ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్
