ఆ రెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు .. ఆందోళనలో ప్రజలు

ఆ రెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు .. ఆందోళనలో ప్రజలు
ఇటీవల యూకే నుంచి కర్ణాటకకు వచ్చిన వారిలో సుమారు 14 మందికి, కేరళకు వచ్చిన 8 మందికి కరోనా సోకినట్లు తేలింది. వరుస కేసులు నమోదు కావడంతో ఇరు రాష్ట్రాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో బ్రిటన్ నుంచి మొత్తం 2500 మంది రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. వీరిలో 1638 మందికి ఇప్పటికే కరోనా టెస్టులు చేశామని… ఇందులో 14 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు. వీరికి సోకిందా కొత్త రకం కరోనా వైరసా లేక పాత రకం వైరసా అన్నది ఇంకా తేలాల్సి ఉందన్నారు.  అటు కేరళలోనూ యూకె నుంచి వచ్చిన 8 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ వెల్లడించారు. వీరి శాంపిల్స్‌ను పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించామని… ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.