కలెక్టర్‌పై దాడి చేసిన వారికి 14 రోజుల రిమాండ్

వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్, ప్రభుత్వం అధికారులపై దాడి చేసిన వారిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల దాడి కేసులో 16 మంది నిందితులను పోలీసులు విచారించి.. బుధవారం కొడంగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. నింధితులను పరిగి సబ్ జైలుకు తరలించారు. కలెక్టర్ దాడి కేసులో విచారణ కోసం దాదాపు 26 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అందులో 16 మందిని కోర్టులో హాజరు పరిచారు. దాడిలో పాల్గొనని వారిని ఇంటికి పంపించారు. లగచర్ల అధికారులపై దాడి ఘటనలో మరో నలుగురిని రిమాండ్ చేసేందుకు పోలీసులు రంగం చేశారు. నలుగురు నిందితులకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. అటు రిమాండ్ కు తరలించిన వారికి కూడా మెడికల్ టెస్టులు చేయించారు పోలీసులు.