ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని.. షూ లేస్‌తో ఉరి వేసుకుని బాలుడు ఆత్మహత్య

ఏపీలో విషాదం చోటు చేసుకుంది.ఆన్‌లైన్‌ గేమ్స్, హర్రర్ వీడియోలు చూడవద్దని తల్లిదండ్రులు మందలించడంతో 13ఏళ్ళ బాలుడు షూ లేస్ తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. విశాఖలోని అక్కయ్యపాలెం ఎన్జీవోస్ కాలనీలో మంగళవారం ( డిసెంబర్ 24, 2024 ) చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవటంతో అమ్మమ్మ ఉంట్లో ఉంటున్నాడు 13ఏళ్ళ బాలుడు.

సెల్ ఫోన్ వాడటం వ్యసనంగా మారిన బాలుడు ఎప్పుడూ సెల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ.. హారర్ వీడియోస్ చేస్తుండేవాడు. దీంతో బాలుడికి సెల్ ఫోన్ వ్యసనం తప్పించాలనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్లు మందలించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

ALSO READ | ఆధార్ కార్డు పేరుతో.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుండి రూ.12 కోట్లు కొట్టేశారు

బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మనవడు చిన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడటంతో కన్నీరు మున్నేరు అవుతున్నారు బాలుడి అమ్మమ్మ, తాతయ్యలు.ఓ భర్త దూరమై ఒంటరిగా ఉంటున్న క్రమంలో చేతికంది వచ్చిన కొడుకు కూడా అర్దాంతరంగా తనువూ చలించడంతో గుండె పగిలేలా ఏడుస్తోంది.