బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ప్రస్తుతం భారత జట్టు దృష్టి మొత్తం ఈ సిరీస్ మీదే ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియాపై ఈ సిరీస్ ను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సొంతగడ్డపై కానుండడం కంగారులకు కలిసి రానుంది. మరోవైపు టీమిండియా పేలవ ఫామ్ లో ఉంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ భారత జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఐదు టెస్టులు జరగనున్న ఈ సుదీర్ఘ టోర్నీలో కోహ్లీ ఫామ్ లోకి వస్తే 13 రికార్డ్స్ బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1) ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ ఇప్పటివరకు కోహ్లీ 1352 పరుగులు చేశాడు. 1809 పరుగులతో భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ టాప్
లో ఉన్నాడు. విరాట్ ఈ సిరీస్ లో మరో 458 పరుగులు చేస్తే ఆసీస్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు.
2) ఆస్ట్రేలియా గడ్డపై 6 సెంచరీలతో విజిటింగ్ ఆటగాళ్లలో కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. హాబ్స్ (9) హమ్మండ్ (7) తొలి
రెండు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ మరో నాలుగు సెంచరీలు కొడితే ఆసీస్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విజిటింగ్ సరికొత్త చరిత్ర
సృష్టిస్తాడు.
3) ఆస్ట్రేలియాలోని అడిలైడ్ గ్రౌండ్ లో కోహ్లీ 509 పరుగులు చేశాడు. అడిలైడ్ లో జరగబోయే టెస్టులో కోహ్లీ మరో 92 పరుగులు చేస్తే
ఒక గ్రౌండ్ లో కంగారూల గడ్డపై అత్యధిక పరుగులు చేసిన విజిటింగ్ ఆటగాడిగా విరాట్ నిలుస్తాడు. జాక్ హాబ్స్ 601 పరుగులతో టాప్
లో ఉన్నాడు.
4) ఆసీస్ గడపై కోహ్లీ ఇప్పటివరకు 30 సార్లు 50 పైగా స్కోర్లు చేశాడు. మరో 5 సార్లు 50 కి పైగా పరుగులు చేస్తే.. కంగారూల గడ్డపై అత్యధిక
50 పైకి పైగా పరుగులు చేసిన విజిటింగ్ ఆటగాడిగా విరాట్ రెండో స్థానానికి చేరుతాడు. తొలి రెండు స్థానాల్లో హెయిన్స్ (34), రిచర్డ్స్
(42) ఉన్నారు.
5) ఆసీస్ గడ్డపై కోహ్లీ ఇప్పటివరకు 3426 పరుగులు చేశాడు. మరో 76 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాపై 3500 పరుగులు చేసిన తొలి భారత
ఆటగాడిగా నిలుస్తాడు.
6)) ఆస్ట్రేలియాలోని అడిలైడ్ గ్రౌండ్ లో కోహ్లీ 5 సెంచరీలు కొట్టాడు. మరో సెంచరీ చేస్తే కంగారూల గడ్డపై ఒకే గ్రౌండ్ లో అత్యధిక
సెంచరీలు చేసిన విజిటింగ్ ఆటగాడిగా విరాట్ అగ్ర స్థానానికి చేరతాడు. జాక్ హాబ్స్ మెల్ బోర్న్ లో 5 సెంచరీలతో కోహ్లీతో సమానంగా
ఉన్నాడు.
7) ఆస్ట్రేలియాలో కోహ్లీ ఇప్పటివరకు 151 బౌండరీలు బాది భారత్ తరపున అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల లిస్టులో మూడో స్థానంలో
నిలిచాడు. సచిన్ 209 బౌండరీలతో టాప్ లో ఉన్నాడు. కోహ్లీ ఈ సిరీస్ లో 59 ఫోర్లు కొడితే సచిన్ ను అధిగమించి అగ్ర స్థానానికి
చేరుకుంటాడు.
8)ఆస్ట్రేలియాపై కోహ్లీ అన్ని ఫార్మాట్ లలో ఇప్పటివరకు 97 మ్యాచ్ లు ఆడి కంగారూల జట్టుపై అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లలో
మూడో స్థానంలో నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడితే ఆస్ట్రేలియాపై 100 మ్యాచ్ లు పూర్తి చేసుకొని
సచిన్ (110) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా విరాట్ నిలుస్తాడు.
9) ఆస్ట్రేలియాపై కోహ్లీ మరో నాలుగు ఫోర్లు కొడితే 500 బౌండరీలు పూర్తి చేసుకున్న మూడో ప్లేయర్ గా అవతరిస్తాడు. ప్రస్తుతం కోహ్లీ
ఖాతాలో 496 ఫోర్లున్నాయి. ఈ లిస్టులో సచిన్ (764), లారా (550) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
10) కోహ్లీ మరో 5 సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియాపై అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. తొలి రెండు
స్థానాల్లో రోహిత్ శర్మ (133) గేల్ (64) ఉండగా.. కోహ్లీ ఖాతాలో 60 సిక్సర్లు ఉన్నాయి.
ALSO READ : ICC Champions Trophy 2025: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. బీసీసీఐకి పీసీబీ స్ట్రాంగ్ మెసేజ్
11) కోహ్లీ మరో 5 సెంచరీలు చేస్తే ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు. సచిన్ 20 సెంచరీలతో .. కోహ్లీ 16 సెంచరీలతో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
12)కోహ్లీ మరో 9 క్యాచ్ లు అందుకుంటే ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్ లలో 75 క్యాచ్ లు అందుకున్న తొలి ప్లేయర్ గా అవతరిస్తాడు.
ద్రవిడ్ (63), ఇయాన్ బోథమ్ (62) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
13) రోహిత్ శర్మతో కోహ్లీ మరో 417 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే ఆస్ట్రేలియాపై ఈ జోడీ 2000 పరుగులను నెలకొల్పుతుంది.
ప్రస్తుతం రోహిత్-కోహ్లీ జోడీ 1583 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నారు.