దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. దేశంలో 12 వేలకు పైగా కేసులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే.. 38.4 శాతం కేసులు పెరిగాయి. దేశంలో కొత్తగా 12 వేల 213 కరోనా కేసులొచ్చాయి. వైరస్ బారిన పడి మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 7 వేల 624 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 2.35 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 58 వేల 215కు పెరిగాయి. ఇప్పటివరకు 195.67 కోట్లకు పైగా టీకాలు పంపిణీ చేసింది కేంద్రం.
#COVID19 | India reports 12,213 new cases & 7,624 recoveries, in the last 24 hours.
— ANI (@ANI) June 16, 2022
Active cases 58,215
Daily positivity rate 2.35% pic.twitter.com/yL8XVI0RHf
మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్న మరో 4,024 కొత్త కేసులొచ్చాయి. వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో 3 వేల 28 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 19 వేల 261గా ఉంది. ముంబై నుంచే 2,293 కేసులు ఉండటం గమనార్హం. దాదాపు ఐదు నెలల తర్వాత ముంబైలో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
దేశ రాజధాని దిల్లీలోనూ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో అంతకుముందు రోజుతో పోలిస్తే.. 22 శాతం కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో మరో 1,375 మంది వైరస్ బారినపడ్డారు. మే 8 తర్వాత ఇవే అత్యధిక కేసులు. మరోవైపు పాజిటివీ రేటు కూడా 7 శాతం దాటడం కలవరపాటుకు గురి చేస్తోంది. వైరస్ వల్ల ఎవరూ చనిపోయకపోవడం ఊరట కలిగించే విషయం.
