ఆలయ వేడుకలో అగ్ని ప్రమాదం..11 మంది సజీవ దహనం

ఆలయ వేడుకలో అగ్ని ప్రమాదం..11 మంది సజీవ దహనం

తమిళనాడులోని తంజావూరులో ఘోర ప్రమాదం జరిగింది. కార్ల వేడుకలో అగ్నిప్రమాదం జరిగి 11 మంది భక్తులు సజీవదహనం అయ్యారు. కలిమేడులోని అప్పర్ ఆలయ రథం విద్యుత్ తీగకు తగిలి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో 11 మంది భక్తులు సజీవ దహనం అయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయ ఉత్సవాల్లో భాగంగా  రథం తిరిగి గుడికి వస్తుండగా ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. రథం కాలి బూడిదైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందంటున్నారు అధికారులు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు కలెక్టర్. ఈ ఘటనలో మరణించిన 11 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది ముఖ్యమంత్రి కార్యాలయం.